epaper
Wednesday, February 18, 2026
epaper

పదవి కోల్పోయిన సర్పంచ్.. ఎందుకో తెలిస్తే..?

కలం, డెస్క్ : ఓ సర్పంచ్ తన పదవిని కోల్పోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఒడిశాలోని(Odisha) కొరాపుట్ జిల్లా పితాగుడ సర్పంచ్ పద్మ కందూల్ పూల్ గత పంచాయతీ ఎన్నికల్లో గెలిచారు. అయితే ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ ఇద్దరే అని తప్పుడు అఫిడవిట్ చేసిందంటూ 2023లో మాజీ సర్పంచ్ గీతా చోపడి ఫిర్యాదు చేశారు. దీనిపై సిమిలిగుడ ఎమ్మార్వో, వైద్యుల బృందం, ఇతర అధికారులు కలిసి దర్యాప్తు చేసి.. పద్మకు ముగ్గురు పిల్లలు ఉన్నట్టు తేల్చారు. దీంతో పంచాయతీ చట్టం 1964 సెక్షన్ 25 ప్రకారం ఇద్దరు పిల్లలకు మించి ఉంటే పదవికి అనర్హులు అని.. కాబట్టి పద్మ తన పదవిని కోల్పోయిందని ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

Read Also: జ‌హీరాబాద్ టార్గెట్ గా బిఆర్ఎస్ బిగ్ ప్లాన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>