epaper
Wednesday, February 18, 2026
epaper

పూరీ బీచ్‌లో 17,000 రుద్రాక్ష‌ల‌తో శివుడి సైక‌త శిల్పం

క‌లం, వెబ్ డెస్క్‌: ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) మహాశివరాత్రి (Shivaratri) సందర్భంగా ఒడిశాలోని పూరీ బీచ్ (Puri Beach) వద్ద ఇసుకతో అద్భుతమైన శివుడి ప్రతిమను రూపొందించారు. ఈ ప్రత్యేక శివుడి ప్రతిమ చుట్టూ 17,000 రుద్రాక్షలు, 500 చిన్న చిన్న శివలింగాలను ఏర్పాటు చేశారు. ఈ సైకత శిల్పంలో ధ్యాన ముద్రలో ఉన్న శివుడు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. సముద్రపు అలల మధ్య ఈ శిల్పం మరింత అందంగా క‌నిపిస్తూ, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెల‌కొల్పింది. ఈ శిల్పాన్ని చూసేందుకు వందలాది భక్తులు, పర్యాటకులు బీచ్‌కు చేరుకుంటున్నారు. శివ‌రాత్రి కావ‌డంతో సోషల్ మీడియాలో కూడా ఈ సైక‌త‌ శిల్పం వైరల్‌గా మారింది. సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ తన విభిన్న‌ ఇసుక కళాకృతులతో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూ ఉంటారు. ప్ర‌తి ప్ర‌త్యేక రోజును త‌న క‌ళ‌తో అందంగా అలంక‌రించే సుద‌ర్శ‌న్ ఇప్పుడు శివ‌రాత్రికి ఆ శివ‌య్య‌ను ఇసుక‌లో అద్భుత శిల్పంగా మ‌లిచాడు. బీచ్‌కు వ‌స్తున్న ప‌ర్యాట‌కులు, సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు సుద‌ర్శ‌న్ శిల్ప క‌ళ‌కు ఫిదా అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>