కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా (Sangareddy) జహీరాబాద్ మున్సిపాలిటీ (Zaheerabad Municipality) చైర్మన్ సీటును కైవసం చేసుకొవడమే లక్ష్యంగా బిఆర్ఎస్ అధిష్ఠానం పావులు కదుపుతోంది. జహీరాబాద్ మున్సిపాలిటిలో మొత్తం 37 వార్డులు ఉండగా బిఆర్ఎస్ పార్టీ-15, కాంగ్రెస్-14, బిజెపి-03, ఎంఐఎం-02, స్వతంత్రులు-03 వార్డుల్లో విజయం సాధించారు. అయితే చైర్మన్ కు అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 19 ని ఏ పార్టీ సాధించలేకపొవడంతో హంగ్ ఏర్పడింది. గెలిచిన 15 మందిని బిఆర్ఎస్ పార్టీ క్యాంపునకు తరలించింది. మ్యాజిక్ ఫిగర్ ను సాధించడానికి నలుగురు సభ్యుల అవసరం బిఆర్ఎస్ కు ఉంది.
జహీరాబాద్ లో చైర్మన్ సీటు గెలవడమే లక్ష్యంగా కారు పార్టీ పక్కా ప్రణాళికను రూపొందిస్తుంది. అందులోభాగంగా రాజ్యసభ సభ్యుడు దీకొండ దామోదర రావు , ఎమ్మెల్సీ మధుసూదనాచారి లు జహీరాబాద్ మున్సిపాలిటీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు చేయలంటూ కమిషనర్ అఫ్ మున్సిపల్ అడ్మిస్టేషన్ కు లేఖ రాశారు. అయితే హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గ దర్శకాల ప్రకారం రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు స్ధానిక ఓటు హక్కు తప్పనిసరి అనే నిబంధన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినది. ఈ నేపధ్యంలో రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీకి జహీరాబాద్ ఓటు హక్కు ఉంటుందో లేదా అనే చర్చ కుడా సాగుతుంది.
ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీకి చెందిన స్ధానిక ఎమ్మెల్యే మాణిక్ రావు సైతం జహీరాబాద్ లోనే ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నాడు. ఇలా రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓట్లను వాడి, స్వతంత్ర అభ్యర్ధుల సహాయంతో జహీరాబాద్ చైర్మన్ కైవసం చేసుకోవాలని చూస్తుంది. అయితే బిఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కౌంటర్ ప్లాన్ ముందుకు తెస్తుందో వేచి చూడాలి. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ సైతం జహీరాబాద్ మున్సిపాలిటీలో (Zaheerabad Municipality) ఎక్స్ అఫిషియో నెంబర్ నమోదు చేసుకున్నాడు. మొత్తానికి జహీరాబాద్ మున్పిసాల్ చైర్మన్ ఎన్నికను ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఎక్స్ అఫిషియో ఓట్లు నిర్ణయించే అవకాశం కన్పిస్తుంది.
Read Also: ఇస్నాపూర్‌లో హంగ్.. ఎంపీ రఘునందన్ బిగ్ ట్విస్ట్
Follow Us On : WhatsApp


