కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా- ఈ రేస్ కేసు (Formula E Case) మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ను (Arvind Kumar IAS) ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర సర్కారు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ కేసు దర్యాప్తు సరికొత్త టర్న్ తీసుకున్నది. ఎప్పుడు ఎవరికి ఎలాంటి నోటీసు వస్తుందో తెలియని అయోమయం నెలకొన్నది. ఎంక్వయిరీల తర్వాత ఏసీబీ చార్జిషీట్‌ను రూపొందించి కోర్టుకు సమర్పించనున్నది. కేటీఆర్, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని (BLN Reddy) ఏసీబీ ప్రధాన నిందితులుగా పేర్కొన్నది. చార్జిషీట్‌లో వీరిపై ఎలాంటి అభియోగాలు నమోదవుతాయన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఒకవైపు అవినీతి ఆరోపణలతో ఏసీబీ.. మరోవైపు ‘ఫెమా’ ఉల్లంఘనలు, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇవ్వడం ఈ కేసులో వాట్ నెక్స్ట్ అనే ఉత్కంఠ మొదలైంది.
ఫార్ములా- ఈ రేస్ కేసుపై కలం 360 డిగ్రీస్ సమగ్ర కథనం కోసం కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: కమిషన్లు, సీబీఐ, ఈడీ… అయినా సస్పెన్స్!
Follow Us On : WhatsApp


