గ్రామ సర్పంచ్ భర్తపై రాళ్లతో దాడి.. ఎస్పీకి ఫిర్యాదు

కలం, జోగులాంబ గద్వాల: ​పొలం వివాదానికి సంబంధించి న్యాయం చేయడానికి వెళ్లిన ఓ గ్రామ సర్పంచ్ భర్తపై దాడికి పాల్పడిన ఘటన బుధవారం మలక్దల్ మండలంలో‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో సర్పంచ్ భర్తకు గాయలయ్యాయి. దీంతో దాడికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్దకల్ మండలం పావనపల్లి గ్రామనికి చెందిన తిరుమలేష్, రాదాకృష్ణలకు గత కొంతకాలంగా గ్రామ శివారులో గల పొలంలో భూవివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఇరువర్గాలు మల్దకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.

ఈ క్రమంలో‌ బుధవారం గ్రామ సర్పంచ్ రాజేశ్వరీ‌ భర్త రామాంజనేయులు‌ మరి కొంత మంది పెద్ద మనుషులు కలిసి పొలం వద్దకు వెళ్లారు. అక్కడ ఇరువర్గాల మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రాధకృష్ణ మరికొందరు కలిసి రామాంజనేయులు పై దాడికి పాల్పడటంతో అక్కడ నుంచి ఆయన పరారయ్యాడు‌‌. ఈ క్రమంలో రామాంజనేయులును వెంబడించి రాళ్లతో దాడికి పాల్పడటంతో గాయలై ప్రాణాలతో బయటపడాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు , గ్రామ సర్పంచ్ గాయపడిన రామాంజనేయులును చికిత్స కోసం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కక్షపూరితంగా రాళ్లతో‌ దాడి.. బాధితుడు ఆరోపణ

రాజకీయ కక్షలు, పొలం వివాదాల నేపథ్యంలో తమపై జరిగిన భౌతిక దాడిపై న్యాయం చేయాలని పావనపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ రాజేశ్వరి భర్త రామాంజనేయులు జిల్లా ఎస్పీ‌కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన తిరుమలేష్, రాధాకృష్ణల మధ్య పొలం వివాదం నడుస్తుండగా, తనకు ఆ గొడవతో ఎలాంటి సంబంధం లేదని బాధితుడు తెలిపారు. ఇటీవల తమ ఊరి వ్యక్తిని మల్దకల్ పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్తుండగా, తిరుమలేష్ ఫోన్ చేయడంతో తాను ఎస్ఐ కలవడం జరిగిందన్నారు.

పోలీసుల ఆదేశాల మేరకు, కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మంగళవారం పొలంలో పనులు పూర్తి చేసి ఎస్ఐ శ్రీహరికి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, బుధవారం పథకం ప్రకారం తనపై సుమారు 12 మంది వ్యక్తులు కక్షపూరితంగా రాళ్లతో దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి నుంచి తప్పించుకోవడానికి తాను దాదాపు 2 కిలోమీటర్లు పరిగెత్తినా, వెంబడించి మరీ తనపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని తెలిపారు.

​తనపై దాడికి పాల్పడిన వారిలో రాధాకృష్ణ, జనార్ధన్, బుచ్చన్న, చిన్న వెంకటేష్, పెద్ద వెంకటన్న, పెద్ద నర్సన్న, లవన్న, కుశలన్న, రామాంజనేయులు, జనార్ధన్ తదితర 12 మంది ప్రమేయం ఉందంటూ వారిపై ఎస్పీ కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పెద్దపల్లికి చెందిన ఓ నేత ప్రోత్సాహంతోనే తనపై దాడి చేశారంటూ, వారికిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసులను కోరినట్లు బాధితుడు రామాంజనేయులు వెల్లడించారు.

ఓర్వలేకనే దాడి: గ్రామ సర్పంచ్ రాజేశ్వరీ

పావనంపల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గ్రామ సర్పంచ్ గా తాను విజయసాధించని సర్పంచ్ రాజేశ్వరీ వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికల సమయం నుంచి నేటి వరకు పెద్దపల్లికి చెందిన నాయకుడి అండబలంతో మాజీ సర్పంచ్ వర్గీయులు, మరి కొందరు మమ్నల్మి భయాందోళనకు గురి చేస్తున్నారని ఆమె కన్నీటితో ఆవేధన వ్యక్తం చేశారు. గ్రామంలో గ్రామ సర్పంచ్ కే రక్షణ కరువైందని, సాదారణ ప్రజలకు రక్షణ ఎక్కడ నుంచి లభిస్తుందని ఆమె అన్నారు.

సర్పంచ్ ఎలక్షన్ గెలిచిన నాటి నుంచి సామాన్య వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదనే ఉద్దేశంతోనే తమపై ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ దాడికి ఒడిగట్టిన వారిపై మరియు ప్రేరేపించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ ని కోరినట్లు అమె తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>