కలం, వెబ్ డెస్క్: రాజకీయాలు, ప్రజా సమస్యలతోపాటు కుటుంబ బంధాలు ఇచ్చే ఆనందం చాలా ప్రత్యేకమైనవని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లాడు. అక్కడ చిన్నారి ‘శివన్ ఎర్రన్నాయుడు’తో (Shivan Yerran Naidu) ఆనందంగా గడిపాడు. దివంగత నాయకుడు ఎర్రన్నాయుడు ప్రతిరూపంగా భావించే చిన్నారితో గడిపిన క్షణాలు తనకు మానసిక తృప్తినిచ్చాయని తెలిపారు. ఆ చిన్నారితో కాసేపు ఆడుకోవడంతో ఒత్తిడంతా మాయమైందన్నారు. తాను కూడా చిన్నపిల్లవాడిలా మారిపోయానన్నారు. ఈ బుజ్జి బాలచంద్రుడిని ఆశీర్వదించండి అంటూ అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
తండ్రికి తగ్గ తనయుడిగా కింజరాపు కుటుంబ కీర్తి ప్రతిష్టలను రామ్మోహన్ నాయుడు నిలబెడుతున్నారని అచ్చెన్నాయుడు ప్రశంసించారు. ఆయన విజయం కేవలం ఆ కుటుంబానికే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు. రాజకీయంలో తన బాధ్యతను గుర్తుచేస్తూ రామ్మోహన్ చూపే ఆప్యాయత తనను ఎంతగానో ఆకట్టుకుంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడి సతీమణి విజయకుమారితో మాట్లాడారు. అప్పటి పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. తరాలు మారినా, పదవులు వచ్చినా కింజరాపు కుటుంబం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుందని స్పష్టం చేశారు.

