ప్రభాస్‌తో కత్రినా కైఫ్.. ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం!

కలం, వెబ్ డెస్క్: ప్రభాస్ అభిమానులతోపాటు బాలీవుడ్‌లోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ పాన్‌-ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) కీలక పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రీ ఖరారైంది. కత్రినాను మరో కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే ప్రభాస్, కత్రినా కైఫ్ తొలిసారి ఒకే తెరపై కనిపించనున్న నేపథ్యంలో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

ఇక ఇటీవల అమెరికాలో జరిగిన తెలంగాణ టాలెంట్ అసోసియేషన్ కార్యక్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడారు. ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన దాదాపు 40 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, టీ-సిరీస్‌తో పాటు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పరిమిత వర్కింగ్ డేస్‌లో చిత్రీకరణను పూర్తి చేసి, 2027 మార్చిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>