పెండింగ్ చలానాలతో రికార్డు.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు!

క‌లం, వెబ్ డెస్క్‌: ఎల్‌బీనగర్‌ (LB Nagar)లో ఒక కారు యజమాని పెండింగ్ ట్రాఫిక్ చ‌లానాల‌ (Traffic Challans)తో రికార్డు సృష్టించాడు. ఏకంగా 95 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనల‌కు పాల్ప‌డి ఒక్క చ‌లానా కూడా క‌ట్ట‌లేదు. రూల్స్ బ్రేక్ చేస్తూ చ‌లానాలు క‌ట్ట‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్న స‌ద‌రు వ్య‌క్తిని సోమ‌వారం ట్రాఫిక్ పోలీసులు ప‌ట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. పోలదాస్ సురేష్‌ అనే వ్యక్తికి చెందిన కారుపై రూ.36,600 చ‌లానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఎల్‌బీ న‌గ‌ర్‌లో తనిఖీలు చేస్తుండ‌గా సురేష్ కారును ఆపారు. వాహ‌నంపై పెండింగ్‌లో ఉన్న చ‌లానాలు చెక్ చేయ‌గా ఈ వ్య‌వ‌హారం బయటపడింది. గతంలో సురేష్‌ మూడుసార్లు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్న‌ట్లు గుర్తించారు. నాలుగోసారి మాత్రం పోలీసులకు దొరికిపోయాడు.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిబంధనలను అతిక్రమిస్తూ చలానాలు కట్టకుండా తిరిగే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సురేష్ కారును పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 95 సార్లు నిబంధనలను (Traffic Challans) బేఖాతరు చేసిన ఈ వ్యవహారం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు తెరలేపింది.

Read Also: ప్రేమ వివాహాలపై కీలక నిర్ణయం.. గుజరాత్‌లో కఠినం, కర్ణాటకలో స్వేచ్ఛ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>