Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్ సీఎం అవుతారు.. తిరుమలలో సముద్రఖని వ్యాఖ్యలు!

కలం, వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని (Samuthirakani), దర్శకుడు మెహర్ రమేశ్ (Meher Ramesh), నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu), శ్యామలా దేవి (Shyamala Devi) స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా.. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం సముద్రఖని (Samuthirakani) మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడులో నటుడు, టీవీకే చీఫ్  విజయ్ ఖచ్చితంగా సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాకుండా భవిష్యత్తులో వచ్చే సమస్యలను విజయ్ అధిగమించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తాను దర్శకత్వం వహించిన స్కూల్ బస్సు సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని ఆకాక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>