ఊర మాస్ లుక్‌లో విజయ్ దేవరకొండ.. బర్త్‌డే పోస్టర్ వైరల్

కలం, సినిమా : స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా (Ravi Kiran Kola) కాంబినేషన్‌లో ‘రౌడీ జనార్ధన'(Rowdy Janardhana) అనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కుతుంది. ఈ భారీ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్  దిల్ రాజు నిర్మిస్తుండగా, క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ బిగ్గెస్ట్ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. గన్ పట్టుకొని ఊర మాస్ లుక్‌లో కనిపిస్తున్న విజయ్ గుండెలపై హీరోయిన్ కాలు పెట్టిన ఈ  పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే హీరోయిన్ లుక్ మాత్రం మేకర్స్ రిలీజ్ చేయలేదు. వరుస పరాజయాల తరువాత సరికొత్త కథాంశాలను ఎంచుకుంటూ విజయ్ దూసుకుపోతున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ గ్రాండ్ రిలీజ్ కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>