నేరెళ్ల శారదకు కీలక పదవి.. ఉత్తర్వులు జారీ

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నాయకురాలు నేరెళ్ల శారద (Nerella Sharada)కు కీలక పదవి దక్కింది. ఆమెను పీసీసీ సోషల్ జస్టిస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేరెళ్ల శారద రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.

ఆమె పదవీ కాలం ముగిసిన తరువాత రెన్యువల్ చేస్తారని పార్టీ వర్గాలు భావించినా.. గద్వాల విజయలక్ష్మిని ఆ స్థానంలో నియమించారు. తాజాగా నేరెళ్ల శారదను సోషల్ జస్టిస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రకటించారు. అలాగే, సంఘటన్ సృజన్ అభియాన్ ఛైర్మన్‌గా గంప వేణుగోపాల్‌ను నియమిస్తున్నట్లు అదే ఉత్తర్వుల్లో మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>