కరీంనగర్‌లో పెరిగిన నేర నిరూపణల శాతం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ (Karimnagar Police) పరిధిలో నేరస్తులకు శిక్షలు ఖరారు చేయించడంలో పోలీసు శాఖ గణనీయమైన పురోగతి సాధించింది. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam)  పర్యవేక్షణలో సీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్  ఆధ్వర్యంలో పోలీసు, ప్రాసిక్యూషన్, కోర్టు సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో 2026 సంవత్సరంలో కన్విక్షన్ రేటు 41.73 శాతానికి పెరిగింది. గత ఏడాది 2025లో ఇది 33.70 శాతంగా ఉంది.

840 కేసుల్లో నేరం రుజువు..

2026లో ఇప్పటివరకు విచారణ పూర్తయిన 2,013 క్రిమినల్ కేసుల్లో 840 కేసుల్లో నేరం రుజువై నిందితులకు శిక్షలు పడ్డాయి. 7 హత్య కేసుల్లో జీవిత ఖైదు పడగా, డ్రంక్ అండ్ డ్రైవ్ విభాగానికి సంబంధించి 7,398 కేసులు పరిష్కారమయ్యాయి. హత్యాయత్నం కేసు (కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్) నిందితుడు అనుముల తిరుపతికి 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించారు. హత్య కేసు (కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్) నిందితుడు ఆసాది కమలాకర్‌కు జీవిత ఖైదు, రూ.5,000 జరిమానా విధించబడింది. ఈ తీర్పులతో ఈ ఏడాది నేర నిరూపణల సంఖ్య 25కు చేరింది.

అధికారులకు సీపీ సత్కారం..

ఈ కేసుల్లో పక్కా సాక్ష్యాధారాలతో నేరాలను నిరూపించి శిక్షలు పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి. లక్ష్మణ్, ఎం. ప్రతాప్, దర్యాప్తు అధికారులు పి. విజ్ఞాన్ రావు, టి. లక్ష్మీబాబు, ఎస్‌హెచ్‌ఓలు ఎ. నిరంజన్ రెడ్డి, కె. సృజన్ రెడ్డితో పాటు కోర్టు డ్యూటీ అధికారులు (సీడివోలు), కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎస్) సిబ్బందిని సీపీ గౌష్ ఆలం శాలువాలు, ప్రశంసా పత్రాలతో అభినందించారు. నేరస్తులకు శిక్షలు పడేలా చూసి బాధితులకు సత్వర న్యాయం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని సీపీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>