Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. ఇకపై రెండు స్పెషల్ సెలవులు

కలం, వెబ్ డెస్క్ : నిరంతరం ప్రజల రక్షణ కోసం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించే పోలీసులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండలు, పబ్బాలు అని తేడా లేకుండా, కుటుంబ వేడుకలకు దూరం అవుతూ తీవ్ర ఒత్తిడితో పనిచేసే సిబ్బందికి మానసిక ఉల్లానిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులు తమ వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేలా.. వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున పోలీసులకు సెలవులు (Police Leaves) మంజూరు చేసింది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ వెసులుబాటు కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అన్ని ర్యాంకుల వారికి ఈ స్పెషల్ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీసు సిబ్బంది తమ జీవితంలోని అత్యంత ముఖ్యమైన రోజులను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకునట్లు వెల్లడించింది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు, వివిధ పోలీస్ విభాగాల అధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తప్ప, సిబ్బంది కోరిన వెంటనే ఈ ప్రత్యేక సెలవును (Police Leaves) మంజూరు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: లేటెస్ట్ సెన్సస్ ప్రాతిపదికగా డీలిమిటేషన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>