epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తలసాని ఇంటికి అఖిలేశ్​ యాదవ్​

కలం, వెబ్​ డెస్క్​ : ఉత్తరప్రదేశ్​ మాజీ సీఎం, సమాజ్​ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్ (Akhilesh Yadav) హైదరాబాద్​ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం రాత్రి బీఆర్​ఎస్​ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ (Talasani Srinivas Yadav)నివాసానికి అఖిలేశ్​ వెళ్లారు. ఆయనకు తలసాని కుటుంబం స్వాగతం పలికింది. తలసాని తన కుటుంబ సభ్యులను అఖిలేశ్​ కు పరిచయం చేశారు. ఆయన వెంట బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR), మాజీ మంత్రి హరీశ్​ రావు (Harish Rao)  తదితరులు ఉన్నారు. అనంతరం భేటీ అయి దేశ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.

కాగా, ఇవాళ ఉదయం హోటల్​ తాజ్​ కృష్ణ లో సమాజ్​ వాది పార్టీ ఆధ్వర్యంలో విజన్ఇండియా సమ్మిట్నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా జరిగినకార్యక్రమానికి హాజరయ్యేందుకు అఖిలేశ్యాదవ్ (Akhilesh Yadav)హైదరాబాద్​ కు వచ్చారు. మొదటి సమావేశం బెంగళూరులో జరగగా రెండో సమ్మిట్​ కు హైదరాబాద్​ ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం రామేశ్వరం కేఫ్​ లో అఖిలేశ్యాదవ్​ తో కలిసి కేటీఆర్​ లంచ్​ చేశారు. కాగా, బీఆర్​ఎస్​ నేతలతో అఖిలేశ్​ యాదవ్​ సమావేశం కావడం పట్ల తెలంగాణ బీజేపీ చీఫ్​ రామచంద్ర రావు తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ దొందు దొందు అని ఆరోపించారు.

Read Also: డ్రైనేజీలో ఓటర్ స్లిప్స్.. ఎమ్మెల్యే వీరేశం రియాక్షన్ ఇదే..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>