కలం, వెబ్ డెస్క్ : అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియెనల్ మెస్సీ (Lionel Messi) రాకతో ఉప్పల్ స్టేడియం ఒక్కసారి దద్దరిల్లిపోయింది. ఫ్రెండ్లీ మ్యాచ్ లో సింగరేణి ఆర్ఆర్ టీమ్ (Singareni RR Team), అపర్ణ జట్లు (Aparna Team) పాల్గొన్నాయి. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరఫున సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బరిలోకి దిగగా.. అపర్ణ జట్టులో మెస్సీ ఆడాడు. అపర్ణ టీమ్ ముందు గోల్ కొట్టగా.. తరువాత సీఎం రేవంత్ రెడ్డి గోల్ చేశాడు. ఫ్రెండ్లీ మ్యాచ్ లో మెస్సీ టీమ్ రెండు గోల్స్ కొట్టింది. సీఎం రేవంత్ ఒక గోల్ చేశాడు. కొద్దిసేపు ఇద్దరు కలిసి గేమ్ ఆడారు. అనంతరం ఇరు జట్లు పెనాల్టీ షూటింగ్ లో పాల్గొన్నాయి.
సీఎం రేవంత్ పెనాల్టీ షూటింగ్ లో గోల్ కొట్టగా.. మెస్సీ (Lionel Messi) చప్పట్లు కొట్టి అభినందించాడు. ఆట పూర్తయిన తరువాత ఇరు జట్లతో ఫొటోలు దిగారు. నాలుగు జూనియర్ టీమ్స్ కు మెస్సీ టిప్స్ ఇచ్చాడు. ఇందులో తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారు. అనంతరం మెస్సీ, రేవంత్ స్టేడియంలో కలియ తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. మ్యాచ్ లో గెలుపొందిన సింగరేణి ఆర్ఆర్ టీమ్ కు మెస్సీ కప్ అందజేశారు. ఈ మ్యాచ్ ను చూసేందుకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) జట్లతో కలిసి ఫోటో దిగారు.
Read Also: బీ అలర్ట్.. పబ్లిక్ ప్లేసుల్లో ఫ్రీ వైఫై వాడుతున్నారా!
Follow Us On: Instagram


