కలం, వెబ్ డెస్క్ : నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) ప్రస్తుతం రామాయణ్ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తండేల్ మూవీతో భారీ హిట్ అందుకున్న సాయిపల్లవి.. తర్వాత తెలుగులో ఏ సినిమా చేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. దిగ్గజ సింగర్, భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మీ బయోపిక్ లో సాయిపల్లవి నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ గౌతమ్ తిన్నమూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడంట. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.
ఎంఎస్ సుబ్బలక్ష్మీ(MS Subbulakshmi) పాత్ర అంటే చాలా హైప్ ఉంటుంది. సాయిపల్లవికి యాక్టింగ్ మీద మంచి గ్రిప్ ఉంది. మహానటి సినిమాలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించి సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. రేపు సుబ్బలక్ష్మీ పాత్రలో కూడా సాయిపల్లవి అలాగే ఒదిగిపోతుందని కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు. సుబ్బలక్ష్మీ పాత్రకు సాయిపల్లవి(Sai Pallavi) సరిగ్గా సరిపోతుందని అంటున్నారు ఫ్యాన్స్. ఎంఎస్ సుబ్బలక్ష్మీ తమిళనాడులో పుట్టి కర్ణాటక శాస్త్రీ సంగీత గాయనిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆమె మెగసెసే అవార్డు కూడా అందుకున్నారు. మరి ఈ మూవీపై అఫీషియల్ గా ఏమైనా అప్డేట్ వస్తుందా లేదా చూద్దాం.
Read Also: చిరు-వెంకీ సీన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి: అనిల్ రావిపూడి
Follow Us On: Instagram


