కలం, వెబ్ డెస్క్: డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)కి మంచి హిట్ ట్రాక్ ఉంది. టాలీవుడ్ వరుస బ్లాక్ బస్టర్లు అందిస్తూ స్టార్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా చేస్తున్నాడు. రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి(Chiranjeevi)కి మొదటి సిట్టింగ్‌లోనే కథ బాగా నచ్చిందని వెల్లడించాడు. ‘‘చిరంజీవి నన్ను నమ్మి, ప్రతి విషయంలోనూ నాకు స్వేచ్ఛనిచ్చారు. దాదాపు 80–85 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. రెండు రోజుల చిన్న ప్యాచ్ వర్క్ తప్ప, అన్నీ పూర్తయ్యాయి. మొదటి భాగం పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి అయ్యిందని’’ అన్నారు.
‘ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం (Music) అందించారు. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. “మీసాల పిల్లా పాటను మొదటిసారి విన్నప్పుడు, కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావించా. కానీ ఇంత తక్కువ సమయంలో 100 మిలియన్ల వ్యూస్ దాటుతుందని ఊహించలేదు. శశిరేఖ కూడా పెద్ద హిట్ అయింది’ అని అనిల్(Anil Ravipudi) అన్నారు.
‘‘విక్టరీ వెంకటేష్ ఒక అతిథి పాత్రలో కనిపించనున్నారు. కథకు స్కోప్ ఉండటంతో వెంకటేష్ (Venkatesh)ను తీసుకురావాలనేది చిరంజీవి ఆలోచన. వారి కాంబినేషన్ సన్నివేశాలు క్రేజీగా, ఎంటర్టైనింగ్‌గా ఉంటాయి. వీరి కాంబో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెంకటేష్ దాదాపు 20 నిమిషాలు తెరపై కనిపిస్తారు. కథ ఎక్కువగా చిరంజీవి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం సంక్రాంతికి రెట్టింపు వినోదాన్ని అందిస్తుంది. వెంకీ నటన ఈ మూవీకి మరో హైలైట్’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు.
Read Also: వాళ్లిద్దరూ వరల్డ్ కప్‌లో గెలిపిస్తారు: అభిషేక్
Follow Us On: X(Twitter)


