కలం, వెబ్ డెస్క్: సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై ట్రాక్టర్ తో దాడి చేసిన ఘటన కామారెడ్డి (Kamareddy Incident) జిల్లాలో సంచలనంగా మారింది. ఎల్లారెడ్డి మండలంలోని సోమార్ పేట్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాపయ్య, బాలరాజ్ పోటీ పడ్డారు. నిన్న వచ్చిన ఫలితాల్లో పాపయ్య గెలిచాడు. తమపై పోటీ చేశారనే కోపంతో పాపయ్య తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్ తో బాలరాజ్ ఇంటి మీద ట్రాక్టర్ తో దాడి చేశాడు. ఈ దాడిలో బాలరాజ్ తో పాటు అతని కుటుంబీకులు స్వరూప, పద్మ సత్తవ్వ, భారతి, బాలమణి తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చిరంజీవి దాడి చేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kamareddy | నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాపయ్య సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ ధర్నా చేపట్టారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. చాలా చోట్ల గ్రామాల్లో ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి.
Read Also: సర్పంచ్ ఎన్నికల్లో సీఎం తిరగడం చరిత్రలో ఎప్పడూ చూడలేదు : కేటీఆర్
Follow Us On: Youtube


