Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రేమ, పెళ్లిపై తేల్చేసిన సాయిపల్లవి..

కలం, వెబ్ డెస్క్ : స్టార్ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె చేస్తున్న సినిమాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. యాక్టింగ్ లో ఆమెకు ఎంత మంచి పాపులారిటీ ఉందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తరచూ ఆమె పెళ్లిపై ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ రూమర్లపై ఓ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నానని.. తన ఫోకస్ మొత్తం రాబోయే సినిమాలపై ఉందని సాయిపల్లవి స్పష్టం చేసింది. తన ప్రేమ, పెళ్లిపై వస్తున్న రూమర్లు మొత్తం ఫేక్ అని స్పష్టం చేసింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం సాయిపల్లవి (Sai Pallavi) రామాయణ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సీత పాత్రలో ఈ నేచురల్ బ్యూటీ కనిపించబోతోంది. త్వరలోనే మూవీకి సంబంధించిన కీలక అప్డేట్లు రాబోతున్నట్టు తెలుస్తోంది. సాయిపల్లవి ఇటు తెలుగులో కూడా ఓ హీరోతో కీలక సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే సాయిపల్లవి చెల్లెలికి పెళ్లి అయిన సంగతి తెలిసిందే.

Read Also: ‘రామా’ గ్లింప్స్‌ రిలీజ్ డేట్ ఫిక్స్ .. ఎప్పుడంటే ?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>