కలం, వెబ్ డెస్క్ : భారతీయ సినీ చరిత్రలో కనువినీ ఎరుగని రీతిలో దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ ‘రామాయణ’ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నమిత్ మల్హోత్రా ఈ భారీ బడ్జెట్ మూవీకి నిర్మాత. ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ (RanbirKapoor) నటిస్తుండగా.. సీతగా సాయి పల్లవి (Sai Pallavi), రావణుడిగా యశ్ (Yash), హనుమంతుడిగా సన్నీదేవోల్ కనిపించనున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా చిత్ర యూనిట్ కీలక అప్ డేట్ ఇచ్చింది. ‘రామా’ గ్లింప్స్ (Rama Glimpse) ను రిలీజ్ డేట్ ను వెల్లడించింది.
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 2న ‘రామా’ గ్లింప్స్ (Rama Glimpse) ను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నిర్మాత నమిత్ మల్హోత్రా ఓ ప్రకటన చేశారు. ‘రామాయణం ప్రతి ఒక్కరిది. ఈ కథను అత్యంత భక్తి, బాధ్యతతో నిజమైన రూపంలో తెరపైకి తీసుకురావడానికి మా టీమ్ కృషి చేస్తోంది. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ‘రామా’ గ్లింప్స్‌ను విడుదల చేసి ఈ ప్రయాణాన్ని అభిమానులతో పంచుకోబోతున్నాం’ అని నమిత్ మల్హోత్రా చెప్పుకొచ్చారు. కాగా, వాల్మీకి మహర్షి రచించిన మహాకావ్యమైన రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఈ చిత్రం మొత్తం రెండు భాగాలుగా రూపొందనుండగా.. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నట్లు సమాచారం అందుతోంది.
Read Also: శ్వాసకోశ వ్యాధులకు మీ ఇల్లూ కారణమే.. ఎందుకో తెలుసా?
Follow Us On : WhatsApp

