ఆటో డ్రైవర్ కావాలనుకున్న ఆర్జీవీ.. ఎందుకో తెలుసా!

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తన జీవితంలో మార్పు అనేది ఎంత సహజమో వివరించాడు. తాను పదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆటో రిక్షా డ్రైవర్‌ (Auto Driver) కావాలని బలంగా కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆటో యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు వచ్చే ఆ శబ్దం తనను అమితంగా ఆకర్షించేదని, కేవలం ఆ సౌండ్ కోసమే తాను ఆటో నడపాలనుకున్నానని వర్మ చెప్పాడు.

వయసు పెరిగే కొద్దీ తన ఆలోచనలు ఎలా మారాయో కూడా వర్మ చెప్పాడు. 15 ఏళ్ల వయసులో తన కజిన్‌ను చూసి స్ఫూర్తి పొంది, అడవిలో నివసించాలని అనుకున్నానని, ఆ తర్వాత ఇంజనీర్ కావాలనుకుని.. చివరికి దర్శకుడిగా స్థిరపడ్డానని ఆయన తెలిపారు.

సినిమాల విషయానికి వస్తే హాలీవుడ్ క్లాసిక్ గాడ్ ఫాదర్ తన కెరీర్‌పై ఎంతో ప్రభావం చూపిందని, సత్య, కంపెనీ, సర్కార్ వంటి సినిమాలు దాని స్ఫూర్తితోనే వచ్చాయని ఆర్జీవీ అంగీకరించారు. అయితే ఇటీవల విడుదలైన ధురంధర్ 2 (Dhurandhar 2) సినిమా చూసిన తర్వాత తన పాత సినిమాలన్నీ వెలవెలబోయినట్లు అనిపించాయని గుర్తు చేసుకున్నారు. పాత పాఠాలు వదిలేసి కొత్త తరం మేకింగ్ శైలిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆర్జీవి (Ram Gopal Varma) అభిప్రాయపడ్డారు.

Read Also: అమెరికా చరిత్రలో తొలిసారి.. డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>