జీవితకాల కనిష్ఠానికి రూపాయి..

కలం, వెబ్​ డెస్క్​ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ కరెన్సీ రూపాయి (Indian Rupee) విలువ మునుపెన్నడూ లేని రీతిలో కనిష్ఠ స్థాయికి పడిపోయింది. శుక్రవారం ట్రేడింగ్ లో ఒక్కరోజే భారీగా క్షీణించి డాలర్​ తో పోలిస్తే రూ. 94.82 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్​ లో డాలర్​ విలువకు డిమాండ్​ పెరగడంతో పాటు అమెరికా, ఇజ్రాయెల్​ – ఇరాన్ యుద్దం కూడా రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన కారణం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్​ లో బ్రెంట్​ క్రూడ్​ ధర బ్యారెల్​ కు 110 డాలర్ల మార్కును దాటింది.

దీంతో భారత్​ లాంటి దిగుమతి దేశాల కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పడింది. అలాగే, భారతీయ స్టాక్​ మార్కెట్ల (Stock Market) నుంచి విదేశి పెట్టుబడిదారులు తమ నిధులు వెనక్కి తీసుకోవడం కూడా రూపాయి (Indian Rupee) క్షీణించడానికి కారణంగా ఉంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి డాలర్​ తో పోలిస్తే 93–94 రూపాయల మధ్య ఉంది. ఈ క్రమంలో శుక్రవారం 86 పైసలు పతనమై 94.82 కు దిగజారింది. అయితే, రూపాయి విలువ బలహీనపడడంతో ముడిచమురు, వంట నూనెలు, ఎలక్ట్రానిక్స్​ వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడం ఖాయంగా కనిపిస్తోంది.

Read Also: ‘ఇక్కత్’​ రంగుల వెనుక నేతన్నల కన్నీటి వ్యథ

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>