కలం, వెబ్ డెస్క్ : శబరిమలలో (Sabarimala) అయ్యప్ప స్వామి భక్తులకు అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మికంగా ఉత్కంఠభరితమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు మాదిరిగానే బుధవారం మకర జ్యోతి (Makara Jyothi) దర్శనం ఇచ్చింది. సాయంత్రం ఆకాశంలో కనిపించే దివ్యజ్యోతిని భక్తులు సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఆశీర్వాద రూపంగా భావిస్తారు. ఈ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివచ్చారు.
దివ్యజ్యోతిని దర్శించుకున్న భక్తుల స్వామియే శరణమయ్యప్ప శరణుఘోషతో కొండలు మారుమోగాయి. 3838 ఎత్తుల అడుగులో వెలిగిన మకర జ్యోతి.. మూడు సార్లు భక్తులకు దర్శనం ఇచ్చింది. జనవరి 19వ తేదీన అయ్యప్ప స్వామి మూలవిరాట్ కి ఆభరణాలతో అలంకరించి దర్శనం కల్పిస్తారు. 20న స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం మూసివేస్తారు.
Read Also: రాజ్‌కోట్‌లో రప్పా రప్పా ఆడించిన రాహుల్..
Follow Us On : WhatsApp


