epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాజ్‌కోట్‌లో రప్పా రప్పా ఆడించిన రాహుల్..

కలం, స్పోర్ట్స్:  న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో కేఎల్ రాహుల్ (KL Rahul) అదరగొట్టాడు. ఒకవైపు ఒత్తిడి పెరుగుతున్నా కూల్‌గా ఉంటూ ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. నిలకడగా ఉండి అద్భుత సెంచరీ సాధించాడు. రాజ్‌కోట్ నిరంజన్ షా స్టేడియంలో రాహుల్ తన బ్యాటింగ్‌తో ఔరా అనిపించాడు. 92 బంతుల్లో అజేయంగా 112 పరుగులు చేసి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో వన్డేల్లో అతనికి ఇది ఎనిమిదో శతకం కావడం విశేషం.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ 21.3 ఓవర్లలో 115 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ పరిస్థితిని చక్కదిద్దాడు. ఒక సిక్సర్ 11 ఫోర్లతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అతని అబ్బుర పరిచే ఇన్నింగ్స్‌తో భారత్ 50 ఓవర్లలో 284 పరుగులు చేసింది.

49వ ఓవర్లో కైల్ జేమిసన్ బౌలింగ్‌లో ఫుల్ టాస్ బంతిని లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్‌గా మలిచి రాహుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ క్షణాన్ని తన కుమార్తె ఇవారాహ్‌కు అంకితం చేస్తూ రెండు వేళ్లతో ప్రత్యేక సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ దృశ్యం అభిమానులను కట్టిపడేసింది.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ రాహుల్ (KL Rahul) మంచి ఫామ్ చూపించాడు. ఆ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో ఒకదాంట్లో 60 పరుగులు, మరోదాంట్లో 66 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ గాయాలతో జట్టుకు దూరమైన సమయంలో తాత్కాలిక కెప్టెన్ బాధ్యతలు స్వీకరించి జట్టును సమర్థంగా ముందుకు నడిపించాడు.

Read Also: ఎల్లమ్మ సినిమా అప్‌డేట్ ఇచ్చిన బలగం వేణు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>