ఇరాన్ తో యుద్ధం వేళ అమెరికాకు పుతిన్ హామీ..?.. క్లారిటీ..!

కలం, వెబ్ డెస్క్: అమెరికా- ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం (Us – Israel – Iran War) వేళ రష్యా ఎవరివైపు? అంటే కొంచెం అంతర్జాతీయ పరిణామాలు తెలిసిన వారు ఇరాన్ వైపే అని చెప్తారు. అయితే తన చిరకాల మిత్రుడిని కాదని అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు రష్యా రెడీ అయిందని యూఎస్ మీడియా పొలిటికోలో రిపోర్ట్ రావడం హాట్ టాపిక్ గా మారింది. రష్యాకు సంబంధించిన నిఘా సమాచారాన్ని వాషింగ్టన్ ఉక్రెయిన్‌కు అందించడం మానేస్తే.. ఇరాన్‌తో నిఘా సమాచారాన్ని పంచుకోవడం క్రెమ్లిన్ ఆపేస్తుందని అమెరికాకు రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) హామీ ఇచ్చారని రిపోర్ట్ లో తెలిపింది. రష్యా దౌత్యవేత్త కిరిల్ దిమిత్రియేవ్ మధ్యవర్తిత్వం ద్వారా ఇది జరిగిందని రిపోర్ట్ లో పేర్కొంది.

అయితే అమెరికా ఉక్రెయిన్ తో సంబంధాలు తెంచుకుంటే, ఇరాన్ కు ఇంటెలిజెన్స్ సహకారం ఆపేస్తామని రష్యా ప్రతిపాదన పెట్టినట్లు వచ్చిన వార్తలను తాజాగా రష్యా దౌత్యవేత్త కిరిల్ దిమిత్రియేవ్ ఖండించారు. ఆ నివేదిక ఫేక్ అని.. ఇది దుష్ప్రచారమని, కావాలనే తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు. కాగా, 2022 ఫిబ్రవరి నుంచి జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ కు సహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే.

అంతకుముందు నౌరుజ్ (Nowruz) పెర్షియన్ నూతన సంవత్సరం పండుగ సందర్భంగా ఇరాన్‌ నాయకులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాస్కో-టెహ్రాన్ మంచి మిత్రులు అని.. టెహ్రాన్ కు మాస్కో నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని పుతిన్ తేల్చి చెప్పారు. ఇరాన్ ప్రజలు కఠినమైన పరీక్షలను గౌరవప్రదంగా అధిగమించాలని కోరారు. ప్రస్తుతం ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) ఇచ్చిన ఈ సందేశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. యుద్ధంలో మిత్రదేశమైన ఇరాన్ కు ఆర్థికంగా, ఆయుధ పరంగా వెన్నుదన్నుగా ఉంటామని రష్యా చెప్పేసిందని స్పష్టం అవుతోంది.

Read Also: కోమటిరెడ్డి మార్క్.. బైక్‌పై వెళ్లి, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పరిశీలించి!

Follow Us On: X(Twitter)

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>