కలం, వెబ్ డెస్క్ : బెంగళూరు నగరంలో దిగ్భ్రాంతికి గురిచేసే హత్యల (Bengaluru Murders) ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుటుంబంలో చెలరేగిన కలహాల కారణంగా ఇందుశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ నరమేధానికి ఒడిగట్టాడు. తన భార్యతో పాటు ఏడేళ్ల పసివాడు సహా అత్తారింటికి చెందిన మొత్తం ఏడుగురు సభ్యులను అతను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, నిందితుడు పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితులను విడతలవారీగా తన ఇంటికి రప్పించి, ఇంట్లోని గ్రైండింగ్ రాయితో తలపై దాడి చేసి ప్రాణం తీశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాలను తన కారులోనే తరలించి నంది హిల్స్ పరిసర ప్రాంతాలలో వేర్వేరు చోట్ల పడేసి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన(Bengaluru Murders)పై కేసు నమోదు చేసుకున్న రాజాజీనగర్ పోలీసులు నిందితుడు ఇందుశేఖర్‌ను అదుపులోకి తీసుకుని, హత్యలకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌పై కేబినెట్ కీలక నిర్ణయం
Follow Us On : WhatsApp

