కలం, వెబ్ డెస్క: కరీంనగర్ (Karimnagar) లోని ఆర్టీసీ బస్టాండ్ ఇన్‌గేట్ సమీపంలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్య (Murder) కు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. షాబాద్‌కు చెందిన మడ్డి సుధాకర్ అలియాస్ సిద్దు హత్యకు గురయ్యారు. మృతుడు స్థానికంగా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.
అశోక్ నగర్‌కు చెందిన ఇబ్రహీం బేగ్ అనే వ్యక్తి బండరాయితో మోది సుధాకర్‌ను దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే మద్యం మత్తులో జరిగిన గొడవే హత్యకు కారణమా? లేక పాత కక్షలా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

