కలం, వెబ్ డెస్క్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన 23 ఏళ్ల శ్రీజా రెడ్డి కోయ అదృశ్యమవడం (Srija Reddy Missing) కలకలం రేపుతోంది. ఆమె మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం (UMass Boston)లో చదువుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తోంది. నవంబర్ 2వ తేదీ రాత్రి డోర్చెస్టర్‌లోని తన నివాసం నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చివరిసారిగా నల్లటి జాకెట్, నీలం రంగు జీన్స్ ధరించిన శ్రీజ మొబైల్ లొకేషన్ సమీపంలోని బీచ్ ప్రాంతంలో చూపించడంతో బోస్టన్ పోలీసులు కార్సన్ బీచ్, హార్బర్ పాయింట్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒక్కగానొక్క కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో స్వగ్రామంలోని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బోస్టన్ పోలీసులు కేస్ నంబర్ 2026-00738 నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, ఆమెను సురక్షితంగా వెతికి పట్టుకునేందుకు భారత రాయబార కార్యాలయం, విదేశాంగ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

