కోమటిరెడ్డి మార్క్.. బైక్‌పై వెళ్లి, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పరిశీలించి!

కలం, నల్లగొండ బ్యూరో: బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు (Brahmana Vellemla Project)తో నల్లగొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. నల్లగొండ మండలంలోని అప్పాజీపేట గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి కాల్వలను పరిశీలించారు. ఆయన స్వయంగా బైక్ నడుపుతూ సాగునీటి కాల్వలను పరిశీలించారు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు నుంచి వచ్చే సాగునీటి కాల్వలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండపాక గూడెం నుంచి అప్పాజీపేట వరకు జరుగబోయే కాలువ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు (Brahmana Vellemla Project) కాలువల ద్వారా నల్గొండ నియోజకవర్గంలోని ప్రతి చెరువును నింపి, ప్రతి ఎకరానికి నీరు అందిస్తానన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తన ధ్యేయమన్నారు. పిల్లకాలువ పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోమటిరెడ్డి ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>