సింపుల్ అలవాట్లతో 30కేజీల బరువు తగ్గిన న్యూట్రీషనిస్ట్..

కలం, వెబ్ డెస్క్ : బరువు తగ్గాలంటే కఠినమైన డైట్లు, గంటల తరబడి జిమ్ వర్కవుట్లు చేయాలని చాలామంది భావిస్తారు. కానీ, అవేమీ లేకుండా కేవలం చిన్నపాటి అలవాట్లతో (Healthy Tips) ఏకంగా 30 కేజీల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ నుపూర్ పాటిల్. ఒలింపిక్ కమిటీ గుర్తింపు పొందిన ఈ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్, తన వెయిట్ లాస్ జర్నీలో పాటించిన ఆ ‘సింపుల్’ టిప్స్‌ ను తాజాగా వెల్లడించారు.

ఆహార విషయంలో తాను ఎప్పుడూ కఠినమైన ఆంక్షలు పెట్టుకోలేదని నుపూర్ పాటిల్ (Nupuur Patil) తెలిపారు. కేవలం ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ, బయటి తిండికి పూర్తిగా దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. వినోదం కోసం తినడం మానేసి, ఆకలి తీర్చుకోవడానికే భోజనం చేశానని ఆమె పేర్కొన్నారు. రోజువారీ ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం, అనారోగ్యకరమైన పదార్థాలను అసలు ఇంట్లోనే ఉంచుకోకపోవడం తన విజయానికి కీలకమని ఆమె చెప్పారు. రాత్రిపూట అనవసరంగా ఫోన్ చూడటం మానేసి, త్వరగా నిద్రపోవడం వల్ల అర్థరాత్రి ఆకలి వేయకుండా చూసుకోగలిగానని ఆమె వివరించారు.

వ్యాయామం కోసం తాను ఎటువంటి ఖరీదైన జిమ్ ప్రోగ్రామ్‌లను ఎంచుకోలేదని నుపూర్ స్పష్టం చేశారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడవడం, తగినంత నీరు తాగడం వంటి చిన్న పనులే తనలో మార్పు తెచ్చాయని చెప్పారు. ఆకలిగా అనిపించినప్పుడు ముందుగా నీళ్లు తాగడం వల్ల అతిగా తినడాన్ని నియంత్రించగలిగానని తెలిపారు. ఫలితాల కోసం ఆత్రుత పడకుండా, మార్పు నిదానంగా వస్తున్నా దాన్ని అంగీకరిస్తూ ముందుకు సాగానని ఆమె వెల్లడించారు.

కొత్తగా వచ్చే ట్రెండ్స్ వెనుక పడకుండా, సాధారణంగా ఉండే ఆరోగ్యకరమైన అలవాట్లనే (Healthy Tips) పదే పదే పాటించడం వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని నుపూర్ పాటిల్ పేర్కొన్నారు. మూడ్ బాగోలేకపోయినా, నీరసంగా ఉన్నా సరే కనీస వ్యాయామం చేయడం మాత్రం మర్చిపోలేదని చెప్పారు. క్రమశిక్షణ, సహనం ఉంటే ఎవరైనా సునాయాసంగా బరువు తగ్గవచ్చని ఆమె నిరూపించారు. కృత్రిమ పద్ధతుల కంటే సహజమైన జీవనశైలి మార్పులే ఆరోగ్యకరమైన వెయిట్ లాస్‌కు దారితీస్తాయని నుపూర్ పాటిల్ ప్రయాణం మనకు గుర్తుచేస్తోంది.

Read Also: వెన్నునొప్పి నివారణకు యోగా చిట్కాలు

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>