రెయిన్‌బో స్కూల్ వద్ద పేరెంట్స్​ ఆందోళన

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో గల రెయిన్‌బో ఇంటర్నేషనల్ స్కూల్ (Rainbow School) ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తోందని వారు ఆరోపించారు. పుస్తకాలు, యాక్టివిటీస్, యాన్యువల్ డే, ఫీల్డ్ ట్రిప్, ట్రాన్స్‌పోర్ట్ వంటి వివిధ విభాగాల పేరుతో ఏదో ఒక రకంగా నిరంతరం డబ్బులు వసూలు చేస్తూ విద్యార్థులను, తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా తమకు నచ్చిన రీతిలో ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచుతున్నారని వాపోయారు. విద్యార్థులతో కలిసి స్కూల్ గేటు ముందు బైఠాయించిన తల్లిదండ్రులు, యాజమాన్య వైఖరీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలిపారు.

Read Also: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. అసలు కారణం ఇదే..

Follow Us On: Facebook

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>