కలం మెదక్ బ్యూరో: టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) కార్మికుల న్యాయమైన డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సందర్భంగా మెదక్ ఆర్టీసీ డిపో (Medak Depot) వద్ద ఆర్టీసీ కార్మికులు (RTC Workers) టపాసులు కాల్చి స్వీట్స్ తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా సానుకూలంగా స్పందించడంపై సంతోషం వ్యక్తం చేశారు.
జేఏసీ నాయకులతో సుమారు పన్నెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపి ముఖ్యమైన 11% ఫిట్‌మెంట్‌కు (వేతన సవరణ), యూనియన్ల ఎన్నికల నిర్వహణ వంటి డిమాండ్ల పరిష్కారానికి నిర్ణయం తీసుకోవడం పట్ల జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిర్వహించిన సమ్మె కార్యక్రమాలలో తమకు మద్దతు ఇచ్చిన అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల (RTC Workers) డిమాండ్‌లకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంబంధిత అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: సాయుధ పోరాటాన్ని వదలం.. మావోయిస్టు పార్టీ ప్రకటన!
Follow Us On: Sharechat

