టీమిండియాలో పడిక్కల్‌కు చోటెక్కడ? సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు..

క‌లం, స్పోర్ట్స్​ : దేవదత్ పడిక్కల్.. ఈ పేరుకు ప్రస్తుతం పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్ 2026లో తనదైన ఆటతీరుతో మెరుస్తున్న బ్యాటర్లలో పడిక్కల్ పేరు తప్పకుండా టాప్ 3లో ఉంటుంది. ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే, అతను టీమిండియాలోకి రావడంపై మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పటికే పటిష్టంగా ఉన్న భారత టీ20 జట్టులో పడిక్కల్‌కు అసలు చోటు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో పడిక్కల్.. ప్రత్యర్థులను ఒకాటాడుకుంటున్నాడు. బౌలర్ ఎవరైనా బౌండ్రీనే టార్గెట్ అన్నట్లు చితకొడుతున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ కేవలం 27 బంతుల్లోనే 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు ఇన్నింగ్స్‌ల్లో 184 స్ట్రైక్ రేట్‌తో 208 పరుగులు చేసిన పడిక్కల్, మూడు హాఫ్ సెంచరీలు బాదేశాడు. అతని ఫామ్‌ను చూసి ఆర్‌సీబీ మెంటర్ దినేష్ కార్తీక్ ప్రశంసలు కురిపించారు. పడిక్కల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, అతడిని భారత జట్టు ఏ ఫార్మాట్‌లోనూ విస్మరించలేదని కార్తీక్ అభిప్రాయపడ్డారు.

కార్తీక్ మాటలతో సెహ్వాగ్ ఏకీభవించడం లేదు. ప్రతి సీజన్‌లోనూ కొత్త ఆటగాళ్లు మెరుస్తారని, కానీ భారత జట్టులో ఖాళీ ఎక్కడ ఉందని సెహ్వాగ్ (Virender Sehwag) ప్రశ్నించారు. శ్రేయస్ అయ్యర్, రజత్ పాటిదార్ వంటి ఆటగాళ్లకే చోటు దొరకడం లేదని, ఇక పడిక్కల్ ఎక్కడ సరిపోతాడని ఆయన అన్నారు. సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటే తప్ప వీరికి అవకాశం రాదని, కానీ ఈ పోటీలో ఏ సీనియర్ ప్లేయర్ కూడా విశ్రాంతి కోరుకోరని సెహ్వాగ్ పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా బ్రేక్ తీసుకుంటే, వారి స్థానంలో వచ్చిన వారు రాణిస్తే సీనియర్ల కెరీర్‌కే ప్రమాదమని ఆయన హెచ్చరించారు.

Read Also: డగ్ బ్రేస్‌వెల్‌కు భారీ షాక్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>