ఎమ్మెల్యేలను కల్లాలకు కాపలా పెట్టండి.. కాంగ్రెస్‌పై RSP ఫైర్

కలం, వెబ్ డెస్క్: నల్గొండ జిల్లా కలెక్టరేట్ వద్ద నేడు జరిగిన రైతు మహా ధర్నాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే రైతుల పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసి కేంద్రం మెడలు వంచి రైతుల పంట కొనుగోలు చేస్తే.. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం లారీలు, గన్నీ బ్యాగులు, సుత్లీ, హమాలీల వంటి కనీస సౌకర్యాలను కూడా రైతులకు కల్పించడం లేదని విమర్శించారు. లారీలు ఇసుక దందాలకు పంపుకున్నాడని.. బ్యాగులల్లో ఢిల్లీకి డబ్బులు మోస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రైతులను వదిలేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 18 గంటలు రివ్యూలు చేస్తున్నాడని మండిపడ్డారు.

ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.70 వేల కోట్ల రైతు బంధు నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. కేసీఆర్ సర్కార్ రూ.1,100 కోట్లతో సుమారు 400 గోదాంల నిర్మాణం చేస్తే, రేవంత్ రెడ్డి (Revanth Reddy) వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు చెప్పి రైతులను నిండా ముంచిండని మండిపడ్డారు. రెండు నెలలుగా రైతులు గోస పడుతుంటే ఒక్క రైతు కల్లానికైనా వెళ్లినవా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. వెంటనే రైతుల పంటను కొనుగోలు చేయాలని.. సరిపడా గన్నీ బ్యాగులు అందించి, లారీల కొరత లేకుండా చూడాలని ఆర్ఎస్పి (RS Praveen Kumar) డిమాండ్ చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయకుండా వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. అవసరమైతే తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కల్లాలకు కాపలా పెట్టండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంత కాలం ఆలస్యం చేసినందుకు సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి రైతులను క్షమాపణ కోరాలని అన్నారు.

Read Also: కాంగ్రెస్‌లో కుంపటి.. ఎంపీ అరవింద్ కామెంట్లతో కొత్త చర్చ !

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>