Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమలగిరిలో ఘోరం.. మహిళ గొంతుకోసి..

కలం, నాగార్జునసాగర్ : తిరుమలగిరి(సాగర్) మండల పరిధిలోని కొంపల్లి (Kompally) గ్రామంలో మంగళవారం ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. గాలి పద్మ అనే మహిళపై గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా దాడికి తెగబడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. కొంపల్లి గ్రామానికి చెందిన గాలి పద్మపై దుండగులు అకస్మాత్తుగా దాడి చేశారు. అంతేకాకుండా ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే స్పందించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పద్మను చికిత్స నిమిత్తం హాలియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, వివరాలు సేకరించారు. “మహిళపై జరిగిన దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాం. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటాం.” అని డీఎస్పీ రాజశేఖర రాజు తెలిపారు. ఈ ఘటనతో కొంపల్లి (Kompally) గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు, ఉద్రిక్తత నెలకొన్నాయి. ఈ దాడికి పాత కక్షలా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

Read Also: కాంగ్రెస్‌లో కుంపటి.. ఎంపీ అరవింద్ కామెంట్లతో కొత్త చర్చ !

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>