అడ్డమైన హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: RSP

కలం, వెబ్ డెస్క్: అడ్డమైన హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. చనిపోయిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్‌ (RTC worker Shankar Goud)కు సంతాపం తెలియజేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ ఆత్మహత్య ప్రభుత్వం చేసిన హత్యగా భావిస్తున్నామని.. ఆర్టీసీ కార్మికులకు టెంట్ సామాన్లు ఇవ్వకూడదని తాండూరు పోలీస్ వాళ్ళు ఇచ్చిన నోటీసు భయానకంగా ఉందని చెప్పారు. పరిస్థితి చూస్తుంటే ఆర్టీసీ కార్మికుల వార్తలు రాస్తున్న విలేకర్లపైన కేసులు నమోదు చేస్తారేమో అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.

ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరం..

సోషల్ మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా కేసు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ.. హేట్ స్పీచ్ బిల్లు తెచ్చి ప్రశ్నించే గొంతుకలను నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. యాంటి టెర్రర్ చట్టాన్ని సామాన్య ప్రజలపై పెడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిస్తున్న మన్నె క్రిశాంక్‌పై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి దగ్గర హోం శాఖ పెట్టుకోవడం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెవిన్యూ శాఖ ఇవ్వడం వెనుక అనేక కుట్రలు దాగి ఉన్నాయన్నారు. పరిస్థితిలు చూస్తుంటే రాను రాను జర్నలిస్ట్‌లపై టెర్రరిస్ట్ కేసులు పెడుతారని అన్నారు.

ఇదెక్కడి న్యాయం?

కొణతం దిలీప్‌పై నిర్మల్ జిల్లాలో అనేక కేసులు పెట్టారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్, ఆయన సతీమణిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్ ఇంటిలిజెన్స్ లాంటి సీక్రెట్ సంస్థలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే బయటపెడుతున్నాడని ఆరోపించారు. సీక్రెట్ సంస్థలను బయట పెడుతున్న రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులు చట్టానికి లోబడి మాత్రమే పనిచేయాలని సూచించారు.జర్నలిస్ట్‌లపై యాంటి టెర్రర్ లా క్రింద నోటీసులు ఇవ్వడం సరైంది కాదన్నారు. టెర్రరిస్ట్ లాంటి చట్టాలను సామాన్య ప్రజలపై పెడుతున్నారని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రమాదకరంలో పడే అవకాశం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీశ్ రావు లాంటి వారిని పెట్రోల్ పోసి చంపుతామని మాట్లాడిన మైనంపల్లి హనుమతురావు, వారి కుమారుడిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మన్నె క్రిశాంక్‌పై కేసులు పెడుతున్నారని.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు.

Read Also: నల్లగొండలో కార్మికుల కొవ్వొత్తుల ర్యాలీ.. శంకర్ గౌడ్‌కు కన్నీటి నివాళి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>