ఢిల్లీ అల్లర్లలో ప్రేమికుల సందడి.. ‘ప్రొటెస్ట్ డేటింగ్’‌‌తో Gen Z హల్‌చల్!

కలం, వెబ్ డెస్క్: యువతలో సరికొత్తగా ఆకట్టుకుంటున్న ‘ప్రొటెస్ట్ డేటింగ్’ (Protest Dating) ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా జంటలు వీకెండ్స్ వస్తే కేఫ్‌లు, రెస్టారెంట్లు, మూవీస్‌కు వెళ్లడం చూస్తుంటాం. కానీ Gen Z (జెన్ జెడ్) యువత మాత్రం ఈ మూస పద్ధతులకు స్వస్తి పలుకుతూ వినూత్న బాట పడుతోంది. తమ భాగస్వామితో కలిసి సమయాన్ని గడపడానికి కేఫ్‌లకు బదులుగా జంతర్ మంతర్ లాంటి ప్రాంతాల్లో జరిగే ధర్నాలు, సామాజిక నిరసన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఒకే రకమైన సామాజిక ఆలోచనలు, భావజాలం ఉన్న జంటలు ఇలాంటి నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నాయి. సామాజిక బాధ్యతను టచ్ చేస్తూ తమ డేటింగ్‌ను మరింత అర్థవంతంగా మార్చుకుంటున్నాయి.

ఢిల్లీకి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్ట్‌తో ఈ కొత్త ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. సదరు యువకుడు తన ప్రియురాలితో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. దీనిని “ప్రొటెస్ట్ డేట్”గా అభివర్ణించాడు. ఈ పోస్ట్ కొన్ని నిమిషాల్లోనే వైరల్‌గా మారి విపరీతమైన వ్యూస్, కామెంట్లను సొంతం చేసుకుంది. కాఫీ షాప్‌లో వందల రూపాయలు ఖర్చు చేసేకంటే, తమకు నచ్చిన సామాజిక అంశంపై పోరాడుతూ భాగస్వామితో బాండింగ్ పెంచుకోవడం ఎంతో మేలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా జెన్ జెడ్ యువత మార్కెట్ మైండ్ సెట్‌‌కు అనుగుణంగా ముందుకు సాగుతోందని సామాజికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>