కాంగ్రెస్(Congress) పార్టీ నేతలు తమ పార్టీ కార్యక్రమంలో బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అసోం(Assam)లోని శ్రిభుమి జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఈ పని చేశారు. ఈ అంశంపై అసోం బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారతదేశంలోని పలు ప్రాంతాలను బంగ్లాదేశ్ తన మ్యాప్‌లో చూపించుకున్న అంశం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న సమయంలో కాంగ్రెస్ నేతలు చేసిన పని.. అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
‘‘కొన్ని రోజుల క్రితమే బంగ్లాదేశ్(Bangladesh).. భారతదేశ ఈశాన్య ప్రాంతం మొత్తాన్ని తనదిగా చూపుకుంటూ మ్యాప్‌ను పబ్లిష్ చేసింది. ఇప్పుడు ఇక్కడ బంగ్లాదేశ్-అబ్సెస్‌డ్ కాంగ్రెస్ నాయకులు అసోం(Assam)లో నిర్వహించిన ఆ పార్టీ కార్యక్రమంలో బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని పాడుతున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ ఆడుతున్న అసలు గేమ్‌ను తెలుసుకోలేకపోయారంటే వాళ్లు అంధులైనా అయి ఉండాలి, లేదా దానికి సహకరిస్తూ అయినా ఉండాలి’’ అని అసోం బీజేపీ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చలకు దారితీస్తోంది. దీనిపై ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం స్పందించలేదు. దీంతో అసోంలో పార్టీ నేతలు చేసిన పనికి కాంగ్రెస్ సహకరిస్తుందా? అన్న చర్చ మొదలైంది.
Read Also: ట్రంప్‌కు దక్షిణ కొరియా అరుదైన గౌరవ

