epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హ్యాంగోవర్‌తోనే మెల‌కువ వ‌చ్చేస్తోంది.. న్యూ ఇయ‌ర్‌పై వ‌ర్మ వ‌రుస ట్వీట్లు

క‌లం వెబ్ డెస్క్ : న్యూ ఇయర్ రానే వచ్చింది.. ప్రతి సెలబ్రెటీ కొత్త సంవత్సరం సందర్భంగా అభిమానులకు విషెస్ చెప్తుంటారు. సోషల్ మీడియా వేదికగా తమకు తోచిన మంచి మాటలతో పోస్టులు పెడతారు.. కానీ దర్శకుడు రాంగోపాల్ వర్మ(RGV) రూటే వేరు.. ఆయన ఏం చేసినా డిఫరెంటే.. ఆర్జీవీ నూతన సంవత్సరం(New Year) సందర్భంగా తనదైన స్టైల్‌లో సోషల్ మీడియా(Social Media)ను షేక్ చేశాడు. ఎక్స్ వేదిక‌గా వరుసగా ఏడు పోస్టులు పెట్టి న్యూ ఇయర్ రిజల్యూషన్స్, ఆశలు, ఆప్టిమిజంపై త‌న అభిప్రాయాల‌తో దండ‌యాత్ర చేశాడు. వర్మ మాటలు నెటిజ‌న్ల‌ను న‌వ్విస్తూనే ఆలోచ‌న‌లో ప‌డేస్తున్నాయి. ఈ పోస్టులు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.

“పుట్టినప్పటి నుంచి మారని వాళ్లు కూడా ఈ అర్ధరాత్రి మారిపోతామని నిజాయితీగా నమ్ముతారు” అని వర్మ సెటైర్ వేశాడు. “న్యూ ఇయర్ అంటే ఏడాది మొత్తం ఉండదు, కొన్ని గంటలే ఉంటుంది. మెలకువ వచ్చేసరికి పాత సమస్యలు మళ్లీ వచ్చేస్తాయి, ఇప్పుడు కొత్తగా హ్యాంగోవర్ కూడా జత అవుతుంది”అని వ‌ర్మ త‌న పోస్టులో పేర్కొన్నాడు. అంటే త‌న‌కు హ్యాంగోవ‌ర్‌తోనే మెల‌కువ వ‌చ్చింద‌ని నెటిజ‌న్ల‌కు చెప్ప‌క‌నే చెప్పేశాడు. ఇక న్యూ ఇయ‌ర్ రోజు రిజల్యూషన్స్ తీసుకోక‌పోవ‌డ‌మే త‌న న్యూ ఇయ‌ర్ రిజల్యూషన్ అని తెలిపాడు. నిజాన్ని గుర్తించిన‌ప్పుడు దానికి త‌గ్గ‌ట్లు మార్పు చేసుకోవాల‌ని, డిసెంబర్ 31 అర్ధరాత్రి వ‌ర‌కు వేచి ఉండకూడదని సలహా ఇచ్చాడు.

అందరూ “ఈ ఏడాది డిఫరెంట్‌గా ఉంటుంది” అంటారు కానీ అదే మాట గతేడాది, అంత‌కుముందు ఏడాది కూడా అన్నారని గుర్తు చేశాడు. “న్యూ ఇయర్ అంటే ఆప్టిమిజం ఎక్కువగా తాగేసి, రియాలిటీ హ్యాంగోవర్ కోసం వేచి ఉంటుంది” అని ఒక పోస్ట్‌లో రాసుకొచ్చాడు. జిమ్‌ల గురించి కూడా వదల్లేదు. జనవరి 1 నుంచి 5 వరకు జిమ్‌లు నిండిపోతాయి, ఆ తర్వాత ఖాళీ అవుతాయని.. అది మోటివేషన్ ఏ రేంజ్‌లో ఉందో చూపిస్తుందని వ‌ర్మ‌ చెప్పారు.

న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటే అంద‌రూ క్యాలెండర్‌ను ఎక్కువగా గౌరవిస్తున్నార‌ని, త‌మ‌ స్వభావాన్ని గౌర‌వించ‌డం లేద‌న‌డానికి రుజువు అని మ‌రో పోస్టులో పేర్కొన్నాడు. పైగా ప్రతి పోస్ట్‌కి #HappyNewYearAnyway అని జోడించి వెట‌కారంగా శుభాకాంక్ష‌లు చెప్పాడు. వర్మ(RGV) పోస్టులు చూసిన నెటిజన్లు న‌వ్వుకుంటూనే ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు. ఏదేమైనా కొత్త ఏడాది సందర్భంగా వర్మ త‌న‌దైన‌ స్టైల్‌లో నెటిజ‌న్ల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డం బాగుంద‌ని అనుకుంటున్నారు.

Read Also: కొత్త ఏడాదిలో సోమరిగా ఉండకండి.. లక్ష్యాన్ని నిర్దేశించుకోండి: K A పాల్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>