కలం, వెబ్ డెస్క్: నేటి నుంచి హైదరాబాద్ నాంపల్లిలో నుమాయిష్ (85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన) జరగనుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ (Numaish) కొనసాగనుంది. దీంతో సిటీ పోలీసులు పలు చోట్లా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) ఉంటాయి. SA బజార్, జంబాగ్ నుంచి నాంపల్లి వైపు వచ్చే RTC జిల్లా బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను MJ మార్కెట్ నుంచి అబిడ్స్ జంక్షన్ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా పోలీస్ కంట్రోల్ రూమ్, బషీర్ బాగ్ వైపు నుంచి వచ్చే వాహనాలను AR పెట్రోల్ పంప్, BJR విగ్రహం వద్ద అబిడ్స్ వైపు మళ్లిస్తారు.
బేగంబజార్ నుంచి మలకుంట వైపు వెళ్లే వాహనాలను అలాస్కా జంక్షన్ వద్ద దారుసలం, ఏక్ మినార్ వైపు మళ్లిస్తారు. గోషామహల్ రోడ్ నుంచి అఫ్జల్‌గంజ్, అబిడ్స్ వైపు వచ్చే వాటిని అలాస్కా జంక్షన్ వద్ద బేగంబజార్, సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు. నాంపల్లికి వచ్చే ఆర్టీసీ బస్సులు సహా వాహనాలను సిటీ కాలేజ్ నుంచి ఎంజె మార్కెట్ వైపు మళ్లిస్తారు. ఎగ్జిబిషన్‌కు (Numaish) వచ్చే సందర్శకులు ఆర్టీసీ, మెట్రో సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
Read Also: మద్యం అమ్మకాల్లో HYD రికార్డ్.. థర్టీ ఫస్ట్‌కు 350 కోట్లు తాగేశారు!
Follow Us On: Instagram


