కలం, వెబ్ డెస్క్: నూతన సంవత్సరం సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్ (KA Paul) శుభాకాంక్షలు తెలిపాడు. కొత్త సంవత్సరంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే ఆసక్తికర విషయాలను నెటిజన్స్‌తో పంచుకున్నాడు. న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఎక్స్‌లో వీడియో షేర్ చేశాడు. కొత్త ఏడాదిలో సోమరిగా ఉండకుండా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు.
‘‘2026లో (New Year) కొత్త నిర్ణయాలు తీసుకోండి. జీవితంలో మీకు ఏం కావాలో తెలుసుకోండి. బరువు తగ్గాలా ఉందా వెంటనే తగ్గండి. జీవితంలో స్థిరపడేందుకు మంచి అవకాశాలు అంటే.. అందుకు తగట్టుగా ముందుకు నడవండి. మంచి మంచి పనులు చేయండి. ఆనందాలను దూరం చేసే సిగరెట్, బీడీలు, సినిమాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా డ్రగ్స్ ద్వారా చాలామంది నష్టపోతున్నారు. అలాంటివాటికి దూరంగా ఉండండి. మీకోసం ఏం చేస్తారు? మీ కుటుంబం కోసం ఏం చేయబోతున్నారు? అనేది తెలుసుకోండి. ఈ సంవత్సరం ఓ కమిట్‌మెంట్ తీసుకోండి.’’ అని పాల్ అన్నారు.


