కలం స్పోర్ట్స్: రియల్ మ్యాడ్రిడ్ క్లబ్‌కు (Real Madrid Club) భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమ స్టార్ ప్లేయర్ కిలియ్ ఎంబాపే మోకాలికి (Kylian Mbappe) గాయమయింది. దీంతో అతడు జట్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్లబ్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం నిర్ధారణ కావడంతో క్లబ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎంబాపే ఎంతకాలం దూరంగా ఉంటారన్న వివరాలు వెల్లడించకపోయినప్పటికీ, కనీసం మూడు వారాలు ఆడే అవకాశంలేదని వర్గాలు చెబుతున్నాయి. ఈ సీజన్‌లో 18 గోల్స్‌తో లా లీగాలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జనవరి 8న సౌదీ అరేబియాలో జరిగే సూపర్ కప్ సెమీఫైనల్ (అట్లెటికో మాడ్రిడ్), లెవాంటేతో లీగ్ మ్యాచ్, చాంపియన్స్ లీగ్‌లో మోనాకోపై కీలక పోరులోనూ అతను ఆడకపోవచ్చని అంచనా.
2025లో అద్భుత ఫార్మ్‌లో కొనసాగిన ఎంబాపే (Kylian Mbappe), ఒక సంవత్సరంలో 59 గోల్స్‌తో క్రిస్టియానో రొనాల్డో క్లబ్ రికార్డును సమం చేసి రియల్‌కు బలం చేకూర్చాడు. రియల్ తరఫున ఇప్పటివరకు 83 మ్యాచ్‌ల్లో 73 గోల్స్ నమోదు చేసిన ఎంబాపే, ఈ సీజన్ లా లీగాలో బార్సిలోనా ఆటగాడు ఫెర్రాన్ టొర్రెస్‌పై ఏడు గోల్స్ ఆధిక్యంతో ముందంజలో ఉన్నాడు. ప్రస్తుతం రియల్ మాడ్రిడ్ జట్టులో డానియెల్ కార్వాజాల్, ఏదర్ మిలిటావో, ట్రెంట్ అలెగ్జాండర్-ఆర్నాల్డ్, ఫెడరికో వాల్వర్డే గాయాలతో దూరంగా ఉండగా, బ్రాహీం డియాజ్ మొరాకో తరఫున ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్‌లో పాల్గొంటున్నాడు.
Read Also: ఐసీసీ ర్యాంకింగ్స్.. విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డు
Follow Us On: Pinterest


