మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్ : సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మోదీ సర్కార్ పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే మహిళ రిజర్వేషన్లు (Women Reservations), డీలిమిటేషన్ (Delimitation)ను రెండింటిని ఒకేలా చూపించే ప్రయత్నం మోదీ సర్కార్ చేస్తోందని ఆరోపించారు. అంతేకాదు ఈ బిల్లుకు విపక్షాలు సహకరించడం లేదంటూ అపవాదులు వేస్తోందని చెప్పారు.

ముఖ్యంగా కాంగ్రెస్ మహిళ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తుందనే అబద్దపు ప్రచారాన్ని మోదీ సర్కార్ చేస్తుందని సీఎం (Revanth Reddy) మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు సముచిత స్థానం దక్కిందని తెలిపారు.  అసలు మహిళ రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కును కల్పించిందే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ పదవుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించిందని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో మహిళలు రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్లుగా ఉన్నారని పేర్కొన్నారు.

1980 ఏప్రిల్ 6 బీజేపీ ఏర్పాటైందని, ఇప్ప‌టి వ‌ర‌కు 15 మంది బీజేపీ అధ్య‌క్షుల నియామ‌కం జ‌రిగిందా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీన్ని బట్టి బీజేపీకి మ‌హిళ ప‌ట్ల గౌర‌వం, చిత్త‌శుద్ది ఎంత ఉందో అర్థ‌మౌతుందని ఎద్దేవా చేశారు. 60 యేళ్ల‌లో మ‌హిళ‌ల కోసం కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని.. 46 యేళ్ల‌లో ఒక్క మ‌హిళ ను పార్టీ అధ్య‌క్షురాలి ని బీజేపీ చేయ‌లేదని, జ‌న‌ర‌ల్ సెక్ర‌టరీ ఆర్గ‌నైజేష‌న్ ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేదని పేర్కొన్నారు.

మ‌హిళ‌ల‌ను చిన్న చూపు చూడ‌ట‌మే బీజేపీ ల‌క్ష‌ణం అని, ద్వితీయ శ్రేణి పౌరులుగా మహిళ‌ల‌ను చూస్తున్నారని ఫైర్ అయ్యారు. స్వాతంత్య్రం తెచ్చింది, రాజ్యాంగాన్ని తెచ్చింది, రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్య‌త కూడా కాంగ్రెస్ దేనని వ్యాఖ్యానించారు. అటు తమ ఎంపీలు తెలంగాణ ను సాధించారు.. ఇప్పుడు పున‌ర్విభ‌జ‌న పైన కూడా పోరాడతారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పునర్విభజన బిల్లు వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని.. జనాభా ప్రతిపాదికన పునర్విభజన బిల్లును ఎలా ఆమోదిస్తారో చూస్తామని హెచ్చరించారు. అన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలకు దీనిపైన లేఖ రాస్తానని వెల్లడించారు.

Read Also: పాదయాత్ర కాదు.. పరిగెత్తే యాత్ర చేయిస్తారు: ఎంపీ రేణుకా చౌదరి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>