కలం, సినిమా : మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గోపీచంద్ తన కెరీర్‌లో నటిస్తున్న 33వ చిత్రానికి సంబంధించి ఆసక్తికర టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు మేకర్స్ ‘భరతవర్ష'(BharataVarsha) అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఒక నిమిషం గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్‌తో పాటు మైథలాజికల్ ఎలిమెంట్స్ కలగలిపిన గ్రాండ్ విజన్‌తో రూపొందుతోంది. ఘాజీ, అంతరిక్షం వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను (BharataVarsha) గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇక గ్లింప్స్‌లో గోపీచంద్ రగ్డ్ వారియర్ లుక్ ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించింది. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బందిపడుతున్న గోపీచంద్ ‘భరతవర్ష’ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.
Read Also: చైనాలో మరో అద్భుతం.. కుక్కలను షికారుకు తీసుకెళ్తున్న ‘రోబో డాగ్స్’
Follow Us On : WhatsApp

