యువతకు ‘నైపుణ్యం-ఉపాధి-అభివృద్ధి’ లక్ష్యంతో పనిచేస్తున్నాం: వివేక్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ యువతకు నైపుణ్యం, ఉపాధి, అభివృద్ధి అనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి వివేక్ వెంకట్ స్వామి (Vivek Venkataswamy) అన్నారు. ప్రతి జిల్లాను అభివృద్ధి కేంద్రంగా, ప్రతి యువకుడిని దేశ నిర్మాణంలో భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas)తో కలిసి రూ.42 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా గ్రామీణ యువత పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన సాంకేతిక విద్య, నైపుణ్య శిక్షణ పొందే అవకాశం కల్పించబడుతుందని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను యువత నేర్చుకోవడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని అన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడం వల్ల క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, ఇంటర్న్‌షిప్‌ల అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గీతే పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>