కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు (Telangana CS) పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ప్రస్తుతం ఏడు నెలల ఎక్స్ టెన్షన్ గడువుపై ఉన్న ఆయన పదవీకాలం ఈ నెల 31న ముగియనున్నది. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాల్సిందిగా ప్రధానికి ఇటీవల లేఖ రాశారు. దానికి సానుకూల స్పందన రావడంతో డీవోపీటీ (DoPT) రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో ఆయన చీఫ్ సెక్రటరీగా జూన్ చివరి వరకు కొనసాగనున్నారు. అప్పటికి జన గణన (Census) ప్రక్రియ దాదాపుగా ముగుస్తుంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి.
తదుపరి చీఫ్ సెక్రటరీ (Telangana CS) ఎవరనేది జూన్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. రామకృష్ణారావు గతేడాది ఆగస్టులోనే రిటైర్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏడు నెలలపాటు ఎక్స్ టెన్షన్ ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ టైమ్ మరో మూడు నెలల పాటు పొడిగించడానికి కేంధ్రం పాజిటివ్‌గా రియాక్ట్ అయింది.
Read Also: హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనండి: బీజేపీ ఎమ్మెల్యే
Follow Us On: Instagram

