కలం, వరంగల్ బ్యూరో : ప్రణామ్ కార్యక్రమం ద్వారా వయోవృద్ధులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రణామ్ డే కేర్ సెంటర్లను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ప్రజాభవన్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. హనుమకొండ పట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ శాఖ ఆవరణలో ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో డే కేర్ సెంటర్లను ప్రారంభించడం అభినందనీయమన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ’60 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు ఉచిత వైద్య సేవలు, చెస్, క్యారమ్ లాంటి ఆటల సౌకర్యాలు కల్పించడం వల్ల వారు తమ సమయాన్ని ఉల్లాసంగా గడుపుతారు’ అని తెలిపారు. రక్తదానం, సేవా కార్యక్రమాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుస్తున్న హనుమకొండ రెడ్ క్రాస్ పాలకవర్గాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్‌లను సమాజంలో సమానంగా చూడాలనే ఉద్దేశంతో మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ సభ్యులుగా తీసుకునే నిర్ణయం మంచిదన్నారు రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీనివాస్ రావు. కార్యక్రమంలో విజయచందర్ రెడ్డి (చైర్మన్), బొమ్మినేని పాపిరెడ్డి (కోశాధికారి), ఇ.వి. శ్రీనివాస్ రావు (రాష్ట్ర పాలకవర్గ సభ్యులు), జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, బిళ్ల రమణ రెడ్డి, బొద్దిరెడ్డి సతీష్ రెడ్డి, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి జె.జయంతి, సాంబమూర్తి, కుక్కల సమ్మయ్య, కె.వీరభద్ర రెడ్డి, డా.పి.వి. శ్రీనివాస్ రావు, సిద్ధోజు విద్యా సాగర్, శ్రీపాద సుధాకర్ రావు, పి.సరళ, టి. శోభా కుమారి, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Also: చలాన్ పడితే ఖాతా ఖాళీ.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం !
Follow Us On: Sharechat


