రేవంత్ తాబేదర్ల కోసమే ప్రజా పాలన : జీవన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి (Jeevan Reddy) విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి స్వార్థ, ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. రేవంత్ తాబేదర్ల కోసమే ప్రజా పాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సొంత కుంపటి పెట్టుకున్నారన్న జీవన్ రెడ్డి.. వేం నరేంద్రరెడ్డికి (Vem Narender) రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చారో రేవంత్ రెడ్డి చెప్పగలరా? అని ప్రశ్నించారు. తనకు పదవుల కన్నా ఆత్మగౌరవం ముఖ్యమని తేల్చి చెప్పారు. అందుకే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న తాను.. ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరినట్లు స్పష్టం చేశారు.

అంతేకాదు రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీజేపీతో ములాఖత్ అయ్యారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆయనకు నమ్మకం లేదని ఆరోపించారు. తన సమర్థత వల్లే రాజకీయాల్లో తాను అన్ని సార్లు అవకాశాలు పొందానని.. తాను ఎవరినీ తొక్కుకుంటూ రాజకీయాల్లోకి రాలేదని వెల్లడించారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి శనిలా మారారని మండిపడ్డారు. అందుకే రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ మళ్లీ రావాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంకా రెండేళ్లు కొనసాగుతారో లేదోనని జీవన్ రెడ్డి (Jeevan Reddy ) బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ పార్టీలో ఏ క్షణమైనా మార్పులు జరగవచ్చని పేర్కొన్నారు.

Read Also: పరకాల పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>