మోదీ, విజయన్‌ మధ్య దోస్తీ .. అందుకే కేసుల నుంచి రక్షణ: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్​ : కేరళ ఎన్నికల (Kerala Elections) ప్రచారంలో భాగంగా ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న అవగాహన వల్లే విజయన్ పై ఉన్న పాత కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

విజయన్‌పై (Pinarayi Vijayan) శబరిమల బంగారం చోరీ, స్మగ్లింగ్ వంటి తీవ్రమైన కేసులు ఉన్నప్పటికీ, కేంద్ర సంస్థలు ఆయనపై ఎందుకు మౌనంగా ఉన్నాయని రేవంత్ ప్రశ్నించారు. ఢిల్లీలో నరేంద్ర మోదీ (PM Modi) రూపంలో విజయన్ కు ఒక గాడ్‌ఫాదర్ ఉన్నారని, అందుకే ఆయనకు రక్షణ లభిస్తోందని విమర్శించారు. దేశం కోసం తమ జీవితాలను, ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని రకరకాల కేసులతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని, అలాగే అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వంటి అనేక మంది నేతలను ఈడీ ద్వారా అరెస్టు చేయించారని రేవంత్ గుర్తు చేశారు. కానీ విజయన్ విషయంలో మాత్రం ఆ దూకుడు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. మోదీ, విజయన్ మధ్య ఉన్న ఈ లోపాయికారి బంధాన్ని కేరళ ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా, విజయన్ తనకు రాసిన లేఖలో 2014 నుంచి 2023 మధ్య కాలంలోని అంశాలను ప్రస్తావించారని, ఆ సమయంలో ఆయనకు అత్యంత సన్నిహితుడైన కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉన్నారని రేవంత్ తెలిపారు. ఆ లేఖలో పేర్కొన్న లోపాల వల్లే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించారని, ఇప్పుడు అదే పరిస్థితి కేరళలో పునరావృతం కాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేరళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో పినరయి విజయన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు.

Read Also: డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం.. దెబ్బతిన్న వాహనాలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>