తమిళనాడు స్టార్ క్యాంపెయినర్స్ సీఎం, డిప్యూటీ సీఎం

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tamil Nadu Elections) స్టార్ క్యాంపెయినర్లుగా తెలంగాణ నుంచి పలువురు సీనియర్ నాయకులను ఏఐసీసీ ఖరారు చేసింది. మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే కేరళ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇకపైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం చేయనున్నారు. తెలంగాణకు గతంలో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా పనిచేసిన మాణిక్కం ఠాగూర్, విష్ణుప్రసాద్ తదితరులు కూడా స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉన్నారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న ముగుస్తుండగా తమిళనాడు పోలింగ్ ఏప్రిల్ 23న జరగనున్నది. కేరళ ప్రచారంలో పలు దఫాలుగా పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు వెలువడే సమయానికి (మంగళవారం ఏప్రిల్ 7) కేరళ అసెంబ్లీ ప్రచారంలో ఉన్నారు. అక్కడ క్యాంపెయిన్ ఏప్రిల్ 7తో ముగియనున్నది. ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాల్గొనున్నారు.

Read Also: విజయన్‌ తప్పుకోవాల్సిన టైం వచ్చింది: సీఎం రేవంత్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>